: తెల్లటి లెదర్ బ్యాగ్ తో అసెంబ్లీకి వచ్చిన యనమల


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాసేపట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఓ తెల్లటి లెదర్ బ్యాగులో బడ్జెట్ ప్రతులను పెట్టుకుని ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా, అక్కడ ఉన్న మీడియాకు ఆ బ్యాగ్ ను చూపించారు. బడ్జెట్ ను నిక్షిప్తం చేసిన ట్యాబ్ ను ఆయన బ్యాగు నుంచి తీసి మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు కూడా ఉన్నారు. ఆయన కూడా కాసేపు బడ్జెట్ బ్యాగ్ ను పైకి ఎత్తి మీడియాకు చూపించారు. ఆర్థిక శాఖ మంత్రిగా యనమల తొమ్మిదో సారి బడ్జెట్ ను ప్రవేశపెడుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News