: గ్యాంగ్ రేప్ మాజీ మంత్రి ప్రజాపతి అరెస్ట్
యూపీ మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఉన్నాయి. తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్టు ఈయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలకు ముందు నుంచే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 27 నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ, ఆయన ఆచూకీ ఇన్నాళ్లు దొరకలేదు. ఇప్పుడు ఆయనను లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ననే ఆయన ఇద్దరు కుమారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.