: జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు.. వేదవ్యాస్ మండిపాటు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారని, టీడీపీ నేత, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ విమర్శించారు. దివంగత ఎమ్మెల్యేకు సంతాపం తెలపనన్న ప్రతిపక్ష నేతను తాను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. ఆయనకు పరిపక్వత ఇసుమంతైనా లేదని అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ శాసనసభలో చారిత్రక, సరిదిద్దుకోలేని తప్పిదం చేశారని వేదవ్యాస్ విమర్శించారు.