: ఐశ్వర్యా రాయ్ ని నేనెప్పుడూ కొట్టలేదు కానీ, సుభాష్ ఘాయ్ పై మాత్రం చేయి చేసుకున్నా!: సల్మాన్ ఖాన్


బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ని తాను ఎన్నడూ కొట్టలేదు కానీ, దర్శకుడు సుభాష్ ఘాయ్ ని మాత్రం లాగి పెట్టి కొట్టానని ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ప్రస్తావించాడు. 2002లో ఐశ్వర్యారాయ్, తన మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు, ఆమెను పలుమార్లు కొట్టినట్టు తనపై ఆరోపణలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశాడు. ఐశ్వర్యను తానెప్పుడూ కొట్టలేదని అన్నాడు.

అయితే, తాళ్ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు సుభాష్ ఘాయ్ పై మాత్రం తాను చేయి చేసుకున్నానని, అందుకు, అప్పటి పరిస్థితులే కారణమని ఈ కండల వీరుడు చెప్పాడు. సహజంగా, తనను ఎవరైనా ఇబ్బంది పెడితే, తనకు తానే గాయపరచుకుంటాను తప్పా, మరొకరిపై ఎప్పుడూ చేయి చేసుకోనని చెప్పాడు. అలాంటి, సుభాష్ ఘాయ్ ని ఎందుకు కొట్టాల్సి వచ్చిదంటే.. తన షూస్ పై ఆయన మూత్ర విసర్జన చేశాడని, తనను స్పూన్ తో కొట్టాడని, ఆయన చేతిలో ఉన్న ప్లేటుతో తన ముఖంపై కొట్టాడని, మెడపట్టి నెట్టాడని .. ఇటువంటి పరిస్థితుల్లో నియంత్రణ కోల్పోయిన తాను ఆయనపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని సల్మాన్ చెప్పాడు. అయితే, ఆ మర్నాడు ఆయనకు సారీ చెప్పానంటూ నాటి సంఘటనలను సల్మాన్ గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News