: కాలు జారి పడబోయిన లోకేశ్ .. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది!
గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. భూమాకు నివాళులు అర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీకి చెందిన నేతలు ఆళ్ళగడ్డకు నిన్న వెళ్లారు. అయితే, ఒక వాహనం పై నుంచి నారా లోకేశ్ కిందకు దిగుతున్న సమయంలో ఆయన కాలు జారడంతో, కింద పడబోయారు. అయితే, అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోకేశ్ ను పట్టుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దిగిన లోకేశ్ నడుచుకుంటూ వెళ్లిపోయారు.