: చైనాలో మళ్లీ ప్రారంభం కానున్న ‘గూగుల్’ సేవలు !


సెన్సార్ షిప్ నిబంధనల విషయంలో వివాదాల కారణంగా చైనాలో ఏడేళ్ల క్రితం ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’ పై నిషేధం విధించారు. అయితే, చైనాలో మళ్లీ ‘గూగుల్’ సేవలు ప్రారంభించేందుకు చైనాకు చెందిన కీలక విభాగాల నేతలు ఆ సంస్థను సంప్రదించినట్టు చైనా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు లీయు బిన్ జీ పేర్కొన్నట్లుసౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.

ఈ విషయమై చైనా, ‘గూగుల్’ సంస్థ మధ్య మంతనాలు జరుగుతున్నాయని తన కథనంలో రాసింది. చైనాలో గూగుల్ బిజినెస్ కొంతమేర ప్రారంభమవుతుందని, క్రమక్రమంగా పెరుగుతుందని భావిస్తున్నట్లు లీయ్ బిన్ జీ చెప్పినట్టు ఆ పత్రికలో రాశారు. అయితే, గూగుల్ సంస్థ తన సేవలను ఎప్పటి నుంచి చైనాలో ప్రారంభిస్తుందనే విషయమై స్పష్టమైన సమాచారం లేదు.

  • Loading...

More Telugu News