: మిచెల్ స్టార్క్ కు షాకింగ్ సమాధానం చెప్పిన ముద్దుగుమ్మ సయామీ ఖేర్
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కు టాలీవుడ్ యువ నటుడు సాయిధరమ్ తేజ్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన సయామీ ఖేర్ సరైన సమాధానం చెప్పింది. రేయ్ సినిమాతో సాయిధరమ్ తేజ్ తో పాటు సయామీ ఖేర్ కూడా వెండితెరకు పరిచయమైంది. రెండో టెస్టులో అవుటైన అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ నిర్ణయానికై ఎదురుచూడడంపై మిచెల్ స్టార్క్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
దీనిపై మండిపడ్డ సయామీ ఖేర్ స్టార్క్ కు సోషల్ మీడియాలో షాకింగ్ సమాధానమిచ్చింది. స్టార్క్ ను ఉధ్దేశించి చేసిన ట్వీట్ లో... 'తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టున్నావ్.. అందుకే రెండో టెస్టులో గాయపడ్డావు. దీంతో ఏకంగా సిరీస్ నుంచే ఇంటిబాట పట్టావు' అని ఎద్దేవా చేసింది. దీనికి ఆమె అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.