: పాతబస్తీలో దారుణం... మాయమాటలతో మైనర్ ను ముంబై తీసుకెళ్లిన బాబా


  హైదరాబాదులోని పాతబస్తీలో పేదరికాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మతం పట్ల వారు చూపే నిబద్ధత, విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ బాబాలు పుట్టుకొస్తున్నారు. పాతబస్తీకి చెందిన మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి నకిలీ బాబా ముంబై తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నట్టు నకిలీ పత్రాలు తయారు చేయించాడు. అయితే ఈలోపే ఆమె తల్లిదండ్రులు దీనిపై చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ముంబైలో బాలికతోపాటు నకిలీ బాబాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఎందుకు ముంబై తీసుకెళ్లాడు, ఎవరికీ తెలియకుండా నకిలీ వివాహ పత్రాలు ఎందుకు తయారు చేయించాడు? వంటి వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News