: తొలిచూపులోనే నేను అతన్ని ఇష్టపడ్డాను: ప్రియాంకా చోప్రా
ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో సినీ నటులను మించిన వారు మరొకరుండరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్ కు తగ్గట్టుగా మాట్లాడుతోంది. క్వాంటికో సీరియల్ లో నటించి అమెరికన్లను ఆకట్టుకున్న ప్రియాంకా చోప్రా..ఇప్పుడు బేవాచ్ లో విక్టోరియా లీడ్స్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది.
ఈ నేపథ్యంలో జీవితంలో ఎప్పుడైనా చూడగానే తొలి ప్రేమ కలిగిన సెలబ్రిటీ ఉన్నారా? అని క్లైర్ మేగజీన్ రిపోర్టర్ అడగగా...'అమెరికా ర్యాపర్ టుపాక్ షకుర్ ను చూడగానే అలాంటి భావన కలిగింది' అని చెప్పింది. అతనంటే ఇష్టమని చెప్పింది. తాను ప్రేమ కోసం ఎదురు చూసే రకాన్ని కాదని, అలా జరగాలని ఉన్నప్పుడు అలా జరిగిపోతుందని తెలిపింది. అలా జరిగిపోతున్నప్పుడు జరగాల్సిన మంచిని పాడు చేసుకోవడం ఎందుకు అనిపిస్తుందని ప్రియాంక చెప్పింది.