: ఒంటరిగానే హనీమూన్ వెళ్లొచ్చిన మహిళ.. సోషల్ మీడియాలో ఫొటోలు హల్ చల్!
పాకిస్థాన్‌కు చెందిన హుమా మొబిన్ అనే ఓ వివాహిత హనీమూన్‌కు ఒంటరిగా వెళ్లొచ్చి నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. హనీమూన్ ట్రిప్పుకు ఆమె ఒంటరిగా వెళ్లి ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ మహిళ భర్తను ఇంటివద్దే వదిలేసి హనీమూన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసా? ఆమె తన భర్త అర్సలాన్ సెవర్తో కలిసి గ్రీస్‌లో సెకండ్ హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్ వేసింది. అయితే, అర్సలాన్కు వీసా సమస్యలు రావడంతో గ్రీస్ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. మరోవైపు వారు హనీమూన్ ట్రిప్‌కు అవసరమైన అన్ని బిల్లులూ కట్టేశారు. ఆ విధంగా అప్పటికే ఎంతో ఖర్చు చేసినా, చివరికి వీసా సమస్య రావడంతో నిరాశచెందారు.
అయితే, ఆ బిల్లులను వృథాగా పోనివ్వడం ఇష్టంలేని హుమా.. ఇక తన భర్త లేకుండానే ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. భర్త కూడా ఆమెను ప్రోత్సహించడంతో అనుకున్న సమయానికి వెళ్లి వచ్చేసింది. ఆమె తన హనీమూన్ సందర్భంగా తీసుకొని సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. భర్త లేకుండా ఆమె ఒంటరిగా పర్యటింటిన ప్రాంతాలు, ఆ సందర్భంలో ఆమె ఇచ్చిన హావభావాలు నెటిజన్లను భలే ఆకట్టుకుంటున్నాయి.