: నాలుగు ఐపాడ్ మోడల్స్ ను పరీక్షిస్తున్న యాపిల్... నెలాఖరులోగా రానున్న మూడు వెరైటీలు


త్వరలో మరిన్ని మోడల్స్ లో ఐపాడ్ లను విడుదల చేయాలని భావిస్తున్న యాపిల్, ప్రస్తుతం నాలుగు వేరియంట్ లను పరీక్షిస్తోందని, వీటి నుంచి మూడు మోడల్స్ ను ఎంపిక చేసి నెలాఖరులోగా మార్కెట్ లోకి విడుదల చేస్తుందని సమాచారం. ఈ విషయాన్ని 'టెక్ క్రంచ్' తన రిపోర్టులో పేర్కొంది. యాపిల్ సంస్థ నాలుగు మోడల్స్ ను పరీక్షిస్తున్నట్టు అనలిటిక్స్ కంపెనీ 'ఫిక్సూ' కూడా పేర్కొంది. టెస్టింగ్ దశలో వివిధ రకాల యాప్స్ ను ఈ ఐపాడ్ లలో వాడుతూ ఉండగా, ఫిక్సూ ట్రాకింగ్ టెక్నాలజీ దీన్ని పసిగట్టిందని వెల్లడించింది.

7,3 అనే కోడ్ నేమ్ వేరియంట్ ను 5 సార్లు, 7,4 అనే వేరియంట్ ను 10 సార్లు, 7,2 - 7,1 వేరియంట్లను వరుసగా 11, 17 మార్లు యాపిల్ పరీక్షించిందని, వీటిల్లో పలు రకాల గేమ్స్, మ్యూజిక్ యాప్స్, రియల్ ఎస్టేట్, వాతావరణ సమాచారాన్ని అందించే యాప్స్ లోడ్ చేసి పరీక్షించారని, ఐఓఎస్ 10.3 వర్షన్ ఆధారంగా పని చేస్తున్నాయని పేర్కొంది. ఇంకా విడుదలకాని ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ 11పైనా ఇవి పనిచేసేలా తయారయ్యాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News