: మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
గోవా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ రోజు తెలిపింది. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడంపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులను గవర్నర్‌ను కలవమని సూచించిన సుప్రీంకోర్టు అనంతరం అంకెలు అతిపెద్ద పార్టీని మాత్రమే సూచిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలంలేదని తెలుపుతూ మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారంపై స్టే వేయాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఈ నెల 16న మనోహర్ పారికర్ విశ్వాస పరీక్షలో నెగ్గాలని ఆదేశించింది.