: సందర్భం కాకున్నా చెబుతున్నా...!: భూమా, తాను వైకాపాను వీడిన కారణాన్ని చెప్పిన జ్యోతుల నెహ్రూ


ఓ నాయకుడికి సంతాపం తెలియజేస్తున్న వేళ, ఆయన గురించి మాట్లాడుతున్న సమయంలో, సందర్భం కాకపోయినా, తాము వైకాపాను వీడి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయాల్సిన సమయం ఇదేనని చెబుతూ వైకాపా నుంచి గెలిచి, తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగన్ వైఖరిపై విమర్శలు గుప్పించారు.

"భూమా నాగిరెడ్డి, నేను, మాతో పాటు ఎంతో మంది జగన్ ను విభేదించి బయటకు రావడానికి కారణం... ఈ తరహా వైఖరేనని చెప్పక తప్పడం లేదు. సందర్భం కాకపోయినా, ఆయన ఏకనాయకత్వం, ఏకపక్ష నిర్ణయం... అది నియంతృత్వ పోకడే. అదే వైఖరిని ఇంకా చూపిస్తున్నారు. అందుకే ఇవాళ ఇక్కడికి రాలేదు" అని అన్నారు. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ నచ్చకనే తామంతా పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని అన్నారు. భూమా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News