: భూమా నాగిరెడ్డి ఆఖరి కోరిక ఇదే... తప్పకుండా తీరుస్తా: చంద్రబాబు హామీ


గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగిన భూమా నాగిరెడ్డి మరణం తరువాత, ఆ కుటుంబానికి తాను పెద్ద దిక్కుగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం అనునిత్యమూ తపించిన ఆయన, శుక్రవారం నాడు తనను కలిసి, నంద్యాలలో పేదలందరికీ ఇళ్లు కట్టించాలని తనను కోరారని గుర్తు చేసుకున్నారు. అదే ఆయన చివరి కోరిక అవుతుందని తాను ఎంతమాత్రమూ అనుకోలేదని బాధతో చెప్పుకొచ్చారు. నంద్యాల పేదలకు ఇళ్లు కట్టించేందుకు తాను కృత నిశ్చయంతో ఉన్నానని, భూమా ఆఖరి కోరికను తాను నెరవేర్చి తీరుతానని అసెంబ్లీలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News