: అసెంబ్లీలో విలపిస్తూ కూర్చున్న అఖిలప్రియ


తండ్రి మరణించిన బాధలోనూ తన కర్తవ్యాన్ని, ప్రజా సంక్షేమాన్నీ వీడక అసెంబ్లీకి వచ్చిన అఖిలప్రియను శాసనసభ్యులంతా పలకరించి, ఓదారుస్తుంటే ఆమె బాధతో తన స్థానంలో కూర్చుండిపోయారు. నిన్న ఆళ్లగడ్డలో భూమా అంత్యక్రియలు ముగిసిన తరువాత, నేడు ఆయనకు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నప్పుడు అఖిలప్రియ కళ్ల నుంచి నీరు కారింది. భూమాతో తనకున్న అనుబంధం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే, అఖిలప్రియ పదేపదే కళ్లు తుడుచుకుంటూ రెండు చేతులతో నమస్కారం చేస్తూ కనిపించారు. ప్రతి ఒక్కరూ అఖిలప్రియను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News