: ఆడలేని స్థితిలో బరిలోకి దిగి.. చారిత్రక విజయం అందించిన గిబ్స్.. బయోగ్రఫీలో వెల్లడి


రాత్రంతా తాగుతూనే ఉన్నాడు.. హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతుంటే బ్యాటింగ్‌కు దిగడం దాదాపు అసాధ్యమనే అనుకున్నాడు. కానీ తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగి, ఆసీస్ బౌలర్లను చిత్తుచేసి దక్షిణాఫ్రికాకు చారిత్రక విజయాన్ని అందించి పెట్టాడు హెర్షలే గిబ్స్(43). ఈ విషయాన్ని స్వయంగా తన ఆటోబయోగ్రఫీ ‘టు ద పాయింట్: ద నో హోల్డ్స్ బార్‌డ్ ఆటోబయోగ్రఫీ’లో పేర్కొన్నాడు.

2006లో జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డే మ్యాచ్ గురించి ప్రముఖంగా అందులో పేర్కొన్నాడు. ఆ వన్డేలో ఆస్ట్రేలియా 434 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సఫారీలు గిబ్స్ వీరవిహారంతో జయకేతనం ఎగురవేశారు. 111 బంతుల్లో 21 ఫోర్లు 7 సిక్సర్లతో చెలరేగిపోయిన గిబ్స్ ఛేజింగ్‌లో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాకు చారిత్రక విజయాన్ని అందించాడు.

అయితే నిజానికి ఆ మ్యాచ్‌లో గిబ్స్ దిగేది అనుమానమే అనుకున్నారు. ఎందుకంటే, ఆ ముందు రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గిబ్స్ మద్యం తాగుతూనే ఉన్నాడు. తప్పనిపరిస్థితుల్లో హ్యాంగోవర్‌తోనే బరిలోకి దిగానంటూ రహస్యాన్ని బయటపెట్టాడు. ‘ఉదయాన్నే తలంతా పట్టేసింది. హ్యాంగోవర్. ఆడతానో? లేదోనని అనుకున్నా’ అని పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే హ్యాంగోవర్‌తోనే బరిలోకి దిగిన గిబ్స్ శివాలెత్తిపోయాడు. మ్యాచ్‌కు ముందురోజు గిబ్స్ మద్యం సేవించిన విషయాన్ని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ కూడా తన ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించడం గమనార్హం. ‘నిద్రపోవడానికి ముందు హోటల్ రూం నుంచి బయటకు వచ్చిన నాకు గిబ్స్ తాగుతూ కనిపించాడు. మరో గంట తర్వాత కూడా అతడు అదే పనిలో ఉన్నాడు. దీంతో ఆసీస్‌కు ఒక వికెట్ కష్టపడకుండానే లభించినట్టేనని భావించా’’ అని హస్సీ తన పుస్తకంలో వివరించాడు.

  • Loading...

More Telugu News