: ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటున్న కొత్త హీరోయిన్!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తాజాగా విడుదలైన 'ద్వారక' సినిమాతో విజయం అందుకున్న హీరోయిన్ పూజా జవేరి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ప్రభాస్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. దీంతో టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. 37 ఏళ్ల ప్రభాస్ ను చేసుకునేందుకు చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇలా ఇంతవరకు ఎవరూ బహిరంగంగా స్టేట్ మెంట్ మాత్రం ఇవ్వలేదని చెప్పచ్చు. కాగా, ప్రభాస్ కు సంబంధాలు చూస్తున్నామని, 'బాహుబలి 2' తరువాత సంబంధాలు కుదిరితే వెంటనే వివాహం చేస్తామని ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.