: బిపాసా ఆ డబ్బు కట్టాల్సిందే: ఫ్యాషన్ షో నిర్వాహకులు


బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు ఆ డబ్బు కట్టాల్సిందేనని ఇండియా-పాక్‌ ఫ్యాషన్‌ షో నిర్వాహకులు స్పష్టం చేశారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, బిపాసా లండన్ కు వచ్చిన పని గురించి ఆలోచించకుండా తన భర్త కరణ్‌ తో కలిసి పర్యటనలు చేస్తూ సమయం, డబ్బు వృథా చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో బిపాసా తన మేనేజర్‌ తో కూడా ఘర్షణ పడిందని వారు చెప్పారు. దీనిపై ఇటీవల బిపాసా బసు తన ఫేస్‌ బుక్‌ పేజ్ ద్వారా ఇచ్చిన వివరణ లేఖ మొత్తం అబద్ధమని వారు చెప్పారు.

అందుకే తాము బిపాసాపై ఖర్చు చేసిన 25 వేల పౌండ్లు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు బిపాసా అంగీకరించని పక్షంలో బిపాసా అసలు రంగు బయటపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, తాను షో కోసం చాలా కష్టపడ్డానని, నిర్వాహకులు తన సమయాన్ని వినియోగించుకోలేకపోయారని బిపాసా ఆరోపించింది. తన సొంత డబ్బుతో లండన్ లో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేశానని చెప్పింది. అలాగే తనకు సరైన హోటల్ సౌకర్యం కల్పించలేదని నిర్వాహకులపై మండిపడిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News