: భార్య లేని లోటు నాగిరెడ్డిని కుంగదీసింది : ఎస్వీ మోహన్ రెడ్డి


భార్య శోభ లేని లోటు భూమా నాగిరెడ్డిని కుంగదీసిందని, ఆమెను గుర్తు చేసుకుని తరచుగా బాధపడుతుండేవారని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శోభా నాగిరెడ్డి సోదరుడు, భూమా నాగిరెడ్డి బావమరిది అయిన ఆయన మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడారు. పైకి గంభీరంగా కనిపించే భూమా నాగిరెడ్డి, తన భార్య పోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతుండేవారని వాపోయారు. నంద్యాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన, భార్య శోభ మరణం, జిల్లా రాజకీయాల ప్రభావం ఆయన అనారోగ్యానికి కారణమయ్యాయని అన్నారు. అఖిల ప్రియకు తోడుగా తానుంటానని, నాగిరెడ్డి రాజకీయంగా ఎదిగే సమయంలో ఇలా మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News