: పాకిస్థాన్, చైనాలకు వ్యతిరేకంగా స్విట్జర్లాండ్ లో బలూచి ఉద్యమకారుల ఆందోళన


స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో పాకిస్థాన్, చైనా దేశాలకు వ్యతిరేకంగా బలూచిస్థాన్ ఉద్యమకారులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు వీరు పాక్, చైనాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలూచిస్థాన్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. బలూచ్ ప్రజలను దోచుకోవడాన్ని పాక్, చైనాలు ఆపేయాలంటూ వారు డిమాండ్ చేశారు. వీరికి ఈయూ మద్దతు ప్రకటించింది. బలూచ్ ప్రజలను పాక్ హింసించడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని ఈయూ పార్లమెంట్ రిజార్డ్ కార్నెకీ తెలిపారు. ఈ సందర్భంగా బలూచ్ ఉద్యమకారుడు మెహ్రాన్ మర్రీ మాట్లాడుతూ, తమ మహిళలను, చిన్నారులను పాక్ మిలిటరీ, ఇంటలిజెన్స్ ఏజన్సీలు కిడ్నాప్ చేస్తున్నాయని మండిపడ్డారు. పాక్ తో చేతులు కలిపితే చైనాకే నష్టమనే విషయాన్ని వారు గర్తించాలని చెప్పారు.  

  • Loading...

More Telugu News