: టీమిండియాలో అంత మార్పుని ఊహించలేకపోయా: మాధ్యూ వేడ్


పూణే టెస్టు పరాజయంతో డీలా పడ్డ భారత్ ను దెబ్బతీయవచ్చని భావించామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాధ్యూ వేడ్ తెలిపాడు. అయితే తాము ఊహించని విధంగా భారత జట్టు పుంజుకుందని అన్నాడు. బెంగళూరు టెస్టులో భారత్ అసాధారణ పోరాటపటిమ కనబర్చిందని కితాబునిచ్చాడు. భారత జట్టు పునరుత్తేజంతో రెండో టెస్టులో ఆడిందని అన్నాడు. టీమిండియా దృక్పథంలో ఊహించని మార్పు వచ్చిందని అన్నాడు. వాస్తవానికి టీమిండియా ఎప్పుడూ ప్రమాదకరమైన ప్రత్యర్థేనని అన్నాడు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా చావుదెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. మూడో టెస్టులో భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడుతామని తెలిపాడు. మెరుగ్గా ఆడుతూ భారత్ నైపుణ్యాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నామని మాధ్యూ వేడ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News