: నిర్మాత దిల్ రాజు సతీమణి అంత్యక్రియలు పూర్తి
సినీ నిర్మాత దిల్ రాజు సతీమణి అనిత అంత్యక్రియలు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ఈ రోజు నిర్వహించారు. అనితకు నివాళులర్పించిన వారిలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, టీడీపీ నేతలు ఎల్.రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు వి.వి.వినాయక్ తదితరులు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం అనిత గుండెపోటుతో మృతి చెందారు.ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం అమెరికా వెళ్లిన దిల్ రాజు, భార్య మృతి వార్త తెలియడంతో నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.