: భూమా భౌతికకాయానికి నివాళి అర్పించిన చంద్రబాబు.. పిల్లలకు ధైర్యం చెప్పిన సీఎం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాసేపటి క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం భూమా కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భూమా రెండో కుమార్తె నాగమౌనిక, ఆయన కుమారుడిని మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబుకు పరిచయం చేశారు. అనంతరం, వీరితో కాసేపు చంద్రబాబు మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, అన్ని వేళలా తాను మీకు అండగా ఉంటానని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. 

  • Loading...

More Telugu News