: ఉత్సాహంగా... ఉల్లాసంగా.. హోలీ వేడుకల్లో పాల్గొన్న అఖిలేశ్‌ యాదవ్


ఇటీవ‌ల జ‌రిగిన‌ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఓడిపోయి ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అఖిలేశ్‌ యాదవ్ ఓట‌మి అంశాన్ని ప‌క్క‌కుపెట్టి ఈ రోజు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. త‌న‌ సొంత జిల్లా ఇటావాలో జరిగిన హోలీ సంబ‌రాల్లో ఆయ‌న పాల్గొని స‌మాజ్ వాదీ పార్టీ కార్యకర్తలకు పండుగ‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ సంబ‌రాల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజ‌రుకావ‌డం విశేషం. యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌చార ధాటికి బీజేపీ ప్రధాన ప్ర‌త్య‌ర్థి ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి కేవలం 54 సీట్లు మాత్రమే దక్కించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News