: బడ్జెట్ పెట్టెతో అసెంబ్లీకి వచ్చిన ఈటల... ఈ దఫా రూ. 1.41 లక్షల కోట్లు
గత సంవత్సరంతో పోలిస్తే రూ. 11 వేల కోట్లు అధిక ప్రతిపాదనలతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ పత్రాలున్న సూట్ కేసుతో ఈటల అసెంబ్లీకి చేరుకున్నారు. మొత్తం రూ. 1.41 లక్షల కోట్ల మేరకు ప్రతిపాదనలను ఆయన సమర్పిస్తారని సమాచారం.
ఈ దఫా వెనుకబడిన తరగతులకు భారీగా నిధులను పెంచుతారని తెలుస్తోంది. వివిధ వర్గాల ఉద్యోగులకు వేతనాల పెంపు, కులవృత్తుల వారికి మరిన్ని నిధులు ఉంటాయని సమాచారం. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల ప్రస్తావన లేకుండా, ప్రగతి, నిర్వహణల పేరిట సంక్షేమ పద్దును తేనున్నామని ఈటల ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఈటల బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీ ముందుకు రానుంది. మండలిలో కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.