: భూమా ఎంతో బాధపడేవారు... నంద్యాల, ఆళ్లగడ్డ ఇక నావి: చంద్రబాబు


అభివృద్ధిలో వెనుకబడిపోయిన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గురించి భూమా నాగిరెడ్డి నిత్యమూ బాధపడుతూ ఉండేవారని, ఈ రెండు ప్రాంతాల్లో సమస్యలపై పలుమార్లు ఆయన తనతో మాట్లాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీరు - ప్రగతిపై ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, నంద్యాల, ఆళ్లగడ్డ సమస్యలపైనే దాదాపు గంటపాటు చర్చించారు. ఈ నియోజకవర్గాల్లో రోడ్లు, సాగునీటి సమస్యలు వెంటనే తీర్చాలని అధికారులను ఆదేశించిన ఆయన, నంద్యాల, ఆళ్లగడ్డ ఇకపై తన సొంత నియోజకవర్గాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని అన్నారు. నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తిగా వెచ్చించాలని సూచించిన ఆయన, ఏ ఒక్కరికీ తాగు నీటి సమస్య లేకుండా చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News