: జయ మేనకోడలు దీపకు గూండాల వేధింపులు!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపకు తీవ్ర ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్న నేపథ్యంలో, ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఆర్కే నగర్ బరిలోకి దిగుతానని తాను ప్రకటించినప్పటి నుంచి తనపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు.

గూండాలు తన నివాసం వద్దకు వస్తున్నారని... ఈ క్రమంలో తాను తన ఇంట్లో కూడా ఉండటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా ఎవరి వర్గానికి చెందినవారో కూడా తెలియడం లేదని చెప్పారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం దీపకు ఓటర్ల నుంచి చాలా మద్దతు ఉంది. జయలలిత నియోజకవర్గం కావడంతో, దీపను అక్కడి ఓటర్లు ఆదరిస్తున్నారు. దీంతో, ఎన్నికల బరిలోకి దిగకుండా ఆమెను అడ్డుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News