: పెట్రోల్ కొట్టించుకున్నారు.. డబ్బులడిగితే చావబాదారు!
బైక్‌లో కొట్టించుకున్న పెట్రోలుకు డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి చావబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ మండలం కొత్తూరులోని ఎస్సార్ పెట్రోల్ బంకుకు ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. పెట్రోలు కొట్టించుకున్నారు. డబ్బులు అడిగిన సిబ్బందిపై దాడిచేశారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోలు బంకుకు చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారయ్యారు. బంక్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.