: టీడీపీతో పొత్తుపై అప్పుడాలోచిస్తాం..!: పురంధేశ్వరి


వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ మహిళా మోర్చా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగితే ఆ పార్టీతో పొత్తు విషయమై పునరాలోచిస్తామని పేర్కొన్నారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత మిత్రపక్షమైన బీజేపీపైనా పడిందని అన్నారు. అందుకే టీడీపీతో పొత్తు విషయమై అప్పుడే ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతం టీడీపీతో తాము మిత్రపక్షంగా ఉన్నా అప్పటి పరిస్థితులను బట్టి పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News