: ప్రహరీ దూకి శ్వేతసౌధంలోకి ప్రవేశించిన వ్యక్తి.. వైట్‌హౌస్‌లో కలకలం!


అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో కలకలం రేగింది. శనివారం అర్ధరాత్రి ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ప్రహరీ దూకి భుజానికి బ్యాగుతో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భవనంలోనే ఉన్నారు. నిందితుడిని గమనించిన ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే అతడిని నిర్బంధించారు. ట్రంప్ తన స్నేహితుడని, అతడిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నానని, గోడదూకి లోపలికి వచ్చానని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. అపాయింట్‌మెంట్ ఉండగా గోడ దూకాల్సిన అవసరమేంటన్న ప్రశ్నకు అతడి నుంచి సమాధానం రాలేదు. అతడి వద్ద కాలిఫోర్నియాకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ దొరికిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News