: నేను ఎక్కే ప్రతి మెట్టు వెనుక ఓ కుటుంబ సభ్యుడు చనిపోతూ వచ్చారు: కొన్ని రోజుల క్రితం ఓ న్యూస్ ఛానెల్ తో భూమా నాగిరెడ్డి


టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఈ రోజు మృతి చెందారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు ఓ న్యూస్ ఛానెల్ తో తన రాజకీయ, వ్యక్తిగత విషయాల గురించి ఆయన మాట్లాడారు. ‘అదృష్ట వంతుడినో, దురదృష్ట వంతుడినో.. నేను ఎక్కే ప్రతి మెట్టు వెనకాలా, ఎవరో ఒక కుటుంబసభ్యుడు చనిపోతూ వచ్చారు. భాస్కరరెడ్డిగారు చనిపోయిన తర్వాత, ఆ స్థానంలో మండల ప్రెసిడెంట్ గా నేను రావాల్సి వచ్చింది. నేను మండల ప్రెసిడెంట్ అయిన రెండేళ్లకే.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిగారు 1991లో చనిపోయారు...’ అంటూ భూమా చెప్పుకొచ్చారు. కాగా, భూమాకు ఈసారి మంత్రిగా అవకాశం కల్పిస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఆ పదవి అందుకోకముందే, ఆయన అనంతలోకాలకు వెళ్లిపోవడం విషాదకరం.

  • Loading...

More Telugu News