: భూమా భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న టీడీపీ శ్రేణులు!
గుండెపోటుతో ఈరోజు మృతి చెందిన భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నంద్యాల టీడీపీ ఆఫీసులో ఉంచారు. భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన టీడీపీ శ్రేణులు ఆయనకు నివాళులర్పించాయి. కాసేపట్లో, భూమా భౌతిక కాయాన్ని ఆళ్లగడ్డకు తరలించనున్నారు. కాగా, భూమా మృతితో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆళ్లగడ్డలో రేపు భూమా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.