: ‘భూమా’ మా కుటుంబానికి అత్యంత ఆప్తులు: కోడెల శివప్రసాద్


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన సంతాపం తెలిపారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తమ కుటుంబానికి అత్యంత ఆప్తులని అన్నారు. నాగిరెడ్డి మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, భూమా మృతిపై ఏపీ శాసనమండలి స్పీకర్ చక్రపాణి  తన సంతాపం తెలిపారు. మరోపక్క గుంటూరులోని ఏపీ టీడీపీ కార్యాలయంలో భూమా నాగిరెడ్డికి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News