: హెలికాప్టర్ లో హైదరాబాదుకి తరలించండి: కలెక్టర్ ను ఆదేశించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు గుండెపోటుకు గురైన ఆయనకు మూడోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో...ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన ఆరోగ్యపరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసిన మెరుగైన వైద్యం కోసం ఆయనను హెలికాప్టర్ లో హైదరాబాదుకు తరలించాలని ఆదేశించారు. నంద్యాలలో ఆయనకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.