: నగరపాలక సంస్థకు లక్షల్లో బకాయి పడ్డ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్!
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ తనకు రావలసిన 70 కోట్ల రూపాయల మెండి బకాయిల లిస్టు విడుదల చేసింది. ప్రముఖ ప్రజాప్రతినిధులు పన్ను ఎగవేతదారుల జాబితాలో ఉండడం కలకలం రేపుతోంది. బకాయిల వివరాల్లోకి వెళ్తే.. కేబీఆర్ కన్ స్ట్రక్షన్స్ గ్రూప్ 53 లక్షల రూపాయల ఆస్తి పన్ను బాకీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ 15.63 లక్షల రూపాయలు, విజయ కృష్ణ సూపర్ బజార్ 15 లక్షల రూపాయలు, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ 14.86 లక్షల రూపాయలు, ఎంపీ కేశినేని నాని 9.44 లక్షల రూపాయలు, అగ్రిగోల్డ్ సంస్థ 6 లక్షల రూపాయలు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ 5.81 లక్షలు, స్టెల్లా కాలేజీ 4.9 లక్షల రూపాయలు, ఎమ్మెల్యే బొండా ఉమ 2.85 లక్షలు, ఎన్ఏసీ కల్యాణ మండపం 2.53 లక్షల రూపాయలు, సీఎస్ఐ చర్చ్ 2 లక్షలు, హెల్ప్ హాస్పిటల్ 1.98 లక్షలు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ 1.98 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ లక్ష రూపాయల బకాయి, పోలిస్ కమిషనర్ గెస్ట్ హౌస్ 97 వేలు, దేవినేని నెహ్రూ కుమార్తె దేవినేని క్రాంతి 38 వేల రూపాయలు బకాయిలున్నారని విజయవాడ నగరపాలక సంస్థ తెలిపింది. ఈ జాబితాలో సుమారు వందమంది బడాబాబులు ఉన్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. వారి జాబితా విడుదల చేశామని తెలిపారు.