: ప్రకాశం వాసులను బెంబేలెత్తించిన భానుడు!


భానుడి ప్రతాపంతో ప్రకాశం జిల్లా ప్రజలు శనివారం చెమటలు కక్కారు. నిన్న ఒక్కసారిగా ఉష్ణోగ్రత భారీగా పెరగడంతో అల్లాడిపోయారు. శనివారం ఉష్ణోగ్రత ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది. సాధారణంగా ఇంతటి ఉష్ణోగ్రత ఏప్రిల్ నెలలో నమోదవుతుంది. రోడ్డుపై నిప్పులు కురుస్తుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ నెల 5 నుంచి 33-34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుండగా శనివారం ఒక్కసారిగా 39.3 డిగ్రీలకు చేరుకుంది.

  • Loading...

More Telugu News