: సీన్ మారిపోయింది.. బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం.. గోవాలో చక్రం తిప్పిన రక్షణమంత్రి!


బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతోపాటు గోవాలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 17 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్‌కు నాలుగు స్థానాల దూరంలో ఆగిపోయింది. బీజేపీ 13 స్థానాలు గెలుచుకున్నా మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం 21కి చేరింది. అంటే సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ అన్నమాట. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని బీజేపీ భావిస్తోంది. మరోవైపు 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆశగా ఉంది. గోవా ఫలితాల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఎంజీపీ, స్వతంత్రులతో మాట్లాడి తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

  • Loading...

More Telugu News