: త్వరలో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ.. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ


బ్యాడ్మింటన్‌లో యవతకు సానబెట్టేందుకు భారత స్టార్ షట్లర్ గుత్తా జ్వాల రెడీ అవుతోంది. నాకౌట్ వెల్‌నెస్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో త్వరలో హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పనున్నట్టు జ్వాల తెలిపింది. పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పనున్న ఈ అకాడమీలో ఓ విదేశీ కోచ్, ఓ భారత్ కోచ్ ఉంటారని వివరించింది. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు జ్వాల పేర్కొంది.

దేశంలో బ్యాడ్మింటన్ కీలకంగా మారుతోందని, యువత ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకుంటోందని తెలిపింది. వారిలోని ప్రతిభను వెలికితీసి, మంచి శిక్షణతో అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చి దిద్దుతామని జ్వాల వివరించింది. తొలుత హైదరాబాద్‌లో అకాడమీని ప్రారంభించి, క్రమంగా దానిని బెంగళూరు, ముంబై, కోల్‌కతాలకు విస్తరించే ఆలోచన ఉందని పేర్కొన్న జ్వాల మొత్తం 50 కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News