: మా అమ్మను అవమానించారు: యూపీ ఎన్నికల ఫలితాలపై షీలాదీక్షిత్ కుమారుడు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ స్పందిస్తూ... కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలంతా బాధ్యత వహించాలని అన్నారు. యూపీలో షీలాదీక్షిత్‌ను అవమానించారని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నేతల వల్లే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటగా షీలాదీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ.. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక షీలా దీక్షిత్ పేరు వినపడలేదు.