: గోవాలోనే అత్యధికంగా 'నోటా' నొక్కిన ఓటర్లు!
ఇటీవల నిర్వహించిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం గోవాలో మిగతా నాలుగు రాష్ట్రాల కన్నా అధికంగా 1.2 శాతం ఓటర్లు 'నోటా' (నన్ ఆఫ్ ద అబౌవ్- పైన పేర్కొన్న వారిలో ఎవరూ అంగీకారం కాదు) మీట నొక్కి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌లో ఒక శాతం, ఉత్తరప్రదేశ్‌లో 0.9శాతం, పంజాబ్‌లో 0.7శాతం, మణిపూర్‌లో 0.5శాతం ఓటర్లు నోటాకు ఓటేశారు. కాగా, మణిపూర్, గోవాలలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కి అధిక స్థానాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరుల మద్దతు అంశం కీలకం కానుంది.