: మోదీకి రాహుల్ గాంధీ అభినందనలు... థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చిన ప్రధాని!


ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య ఢంకా మోగించిన విష‌యం తెలిసిందే. ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందిస్తూ..  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి, బీజేపీకి అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. దీనికి స్పందించిన మోదీ ‘థ్యాంక్స్‌.. లాంగ్‌ లివ్‌ డెమోక్రసీ’ అని రిప్లై ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్.. పంజాబ్‌లో త‌మ పార్టీని గెలిపించినందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ అభివృద్ధికి తాము కృషి చేస్తామ‌ని అన్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలకు, కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.








  • Loading...

More Telugu News