: 'జనతా గ్యారేజ్' బైక్ పై షికారు చేసిన కోమటిరెడ్డి!
'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన బుల్లెట్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి షికారు చేశారు. ఈ బైకును నల్గొండ జిల్లా పగిడిమర్రికి చెందిన రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వేలంలో పాడుకున్నాడు. రూ. 10 లక్షల రూపాయలతో ఆయన ఈ బైకును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో, కోమటిరెడ్డి ఈ బైక్ పై సందడి చేశారు. దొరెపల్లి ఎంపీటీసీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీకి వచ్చిన కోమటిరెడ్డి ఈ బైకును నడిపి ఎన్టీఆర్ అభిమానులను హుషారు పరిచారు.