: ఇక 2019 మ‌ర్చిపోండి.. 2024 కోసం ప్రణాళిక వేసుకోండి!: మోదీ ప్ర‌త్య‌ర్థుల‌కు ఒమ‌ర్ అబ్దుల్లా సూచ‌న


ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీ ఆధిక్యంతో విజ‌య దుందుభి మోగించే దిశ‌గా ప‌య‌నిస్తుండ‌డంతో ఆ అంశంపై జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా స్పందిస్తూ అనూహ్యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. ఈ ఫలితాలు చిన్న చెరువులో అల‌లలాంటివి కావని.. ఇదో సునామీ అని ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇక మోదీ ప్ర‌త్య‌ర్థి పార్టీలు 2019 ఎన్నిక‌ల‌ని మ‌ర్చిపోవాల‌ని, 2024 కోసం ప్రణాళిక వేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మోదీని స‌వాలు చేసే జాతీయ నేత‌లు ఎవ్వ‌రూ లేరని ఉద్ఘాటించారు. 2019లో కేంద్రంలో బీజేపీని ఎదుర్కునే పార్టీలు ఏవీ ఉండ‌బోవ‌ని ఉద్ఘాటించారు.





  • Loading...

More Telugu News