: రేవంత్, సండ్రలను సస్పెండ్ చేసిన తెలంగాణ అసెంబ్లీ!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, ఆయన్ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్రలను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెన్షన్ ఒకరోజో, రెండు రోజులో కాకపోవడం గమనార్హం. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఈ ఉదయం అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించడం సంచలనం కలిగించింది. స్పీకర్ చర్యను కాంగ్రెస్ ఖండించింది. కాగా, గవర్నర్ ప్రసంగం వేళ, కాంగ్రెస్ సభ్యులు సైతం నిరసన తెలిపి వాకౌట్ చేసినప్పటికీ, వారిపై ఎటువంటి వేటు పడలేదు.