: అది రజనీకాంత్ కే సొంతం.. దానికి నేను అర్హున్ని కాను: లారెన్స్ రాఘవ


కేవలం ఒక్క సినిమా చేసిన హీరోలు కూడా తమ పేర్ల ముందు ఏదో ఒక 'స్టార్' అంటూ బిరుదు పెట్టుకోవడం సాధారణమైపోయింది. కానీ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ మాత్రం తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. తాజాగా అతని కొత్త సినిమా 'మొట్టశివ కెట్టశివ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్స్ లో లారెన్స్ పేరు ముందు 'మక్కల్ సూపర్ స్టార్' అని వేశారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ పరిశ్రమలో సూపర్ స్టార్ అనేది కేవలం రజనీకాంత్ కు మాత్రమే వాడుతున్నారు.

ఈ నేపథ్యంలో లారెన్స్ స్పందిస్తూ, తన పేరు ముందు మక్కల్ సూపర్ స్టార్ అని ఉండటాన్ని చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పారు. సూపర్ స్టార్ అంటే కేవలం తలైవర్ రజనీ సార్ మాత్రమే అని చెప్పారు. తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనేనని... తాను ఆయనకు వీరాభిమానినని అన్నారు. తన పేరుకు ముందు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తన తల్లి పేరును పెట్టుకుంటానని.... తన తల్లి పేరును కలిపి కన్మణి లారెన్స్ రాఘవ అని పిలిస్తే తాను మరింత ఆనందిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News