: మారిపోయిన సమాజ్ వాదీ... కార్యాలయం నుంచి రాహుల్ కటౌట్లు, ప్లెక్సీల తొలగింపు


యూపీలో తిరిగి అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టమవుతున్న వేళ, సమాజ్ వాదీ పార్టీ మనసు మార్చుకుంది. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిలిపిన రాహుల్ గాంధీ నిలువెత్తు కటౌట్లను, ఆయన చిత్రాలున్న ప్లెక్సీలను ఆ పార్టీ తొలగించింది. వాటి స్థానంలో పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన సమాజ్ వాదీ, ఫలితాలను తనకు అనుకూలంగా తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 338 స్థానాల ట్రెండ్స్ వెల్లడవుతుండగా, బీజేపీ కూటమి 237 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, సొంత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. సమాజ్ వాదీ కూటమి 69 సీట్లలో, బీఎస్పీ 29 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరో 65 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కావాల్సివుంది.

  • Loading...

More Telugu News