: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు.. డోంట్ మిస్ ఇట్!: రాజమౌళి


నేటి మధ్యాహ్నం 12 గంటలకు బాహుబలి ఫేస్ బుక్ పేజీని మిస్ కావద్దని దర్శక దిగ్గజం రాజమౌళి పిలుపునిచ్చారు. ఈ మేరకు 'బాహుబలి' అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై లైవ్ ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, ఈ లైవ్ లో ఆయన స్వయంగా పాల్గొని అభిమానులు అడిగే ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు ఇస్తారని తెలుస్తోంది. ఫేస్ బుక్ లో 'baahubalimovie' ద్వారా ఈ లైవ్ ను వీక్షించవచ్చని రాజమౌళి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరం.

  • Loading...

More Telugu News