: పవన్ తో చేయి కలిపిన శ్రుతి... ‘కాటమరాయుడు’ తాజా స్టిల్!
డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం పాటల చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తాజా స్టిల్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఇందులో, ఒక టేబుల్ పై కూర్చుని ఉన్న పవన్ కల్యాణ్ చేతిని తన చేతుల్లోకి శ్రుతిహాసన్ తీసుకుని ఉంది. కాగా, ఈ నెల 24న లేదా 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాటమరాయుడు’ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు.