: అక్రమాస్తుల కేసులో జగన్ వారానికి రెండుసార్లు కోర్టుకు వెళ్లివస్తున్నారు: గాలి ముద్దుకృష్ణమ
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆస్తులపై విమర్శలు గుప్పిస్తోన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. లోకేశ్ వాస్తవ ఆస్తులను ప్రకటిస్తే వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. పెరిగిన షేర్ విలువను ఉన్నది ఉన్నట్లు చూపించడం లోకేశ్ చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో జగన్ వారానికి రెండు సార్లు కోర్టుకు వెళ్లివస్తున్నారని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు చంద్రబాబును ఎన్నోసార్లు ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలని చూశారని ఆయన అన్నారు.