: ‘సాక్షి’ కాదు..చంద్రబాబే 'ఇన్ జ్యూరియస్ టూ హెల్త్': వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్
అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్న సాక్షి దిన పత్రికను చదవద్దని, ఛానెల్ ను చూడద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ పార్టీకి విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ,‘సాక్షి’ కాదు..చంద్రబాబే ఇన్ జ్యూరియస్ టూ హెల్త్ అని, నారా లోకేశ్ ఆస్తుల వాస్తవాలు వెల్లడిస్తే ‘సాక్షి’ మీడియాను తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.